పోయిన ఫోన్లపై ఫోకస్..!
– ఒకే రోజు మూడు సెల్ ఫోన్ల రికవరీ
– తాండూరు పట్టణ పోలీసు రికార్డు
– వెల్లడించిన సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినియోగదారులు పోగొట్టుకున్న ఫోన్లపై వికారాబాద్ జిల్లాలోని తాండూరు పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సర్కారు ప్రవేశ పెట్టిన సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) అప్లికేషన్ ద్వారా పోయిన ఫోన్లను ట్రేస్ చేస్తున్నారు. తాజాగా ఒకే రోజూ మూడు ఫోన్లను ట్రేస్ చేసి రికార్డు సాధించారు. సోమవారం పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 18న తాండూరు పట్టణంలోని సాయిపూర్ లో లక్ష్మమ్మ అనే మహిళ తన ఫోన్ పోగొట్టుకుంది. అదే నెల 27న మరో వ్యక్తి తాండూరు రైల్వే స్టేషన్ లో మోబైల్ పోగొట్టుకున్నారు. గత నెల మే 26న నాగరాజు అనే వ్యక్తి శివాజీ చౌరస్తాలో ఫోన్ పోగొట్టుకున్నారు. అందరు వేరు వేరుగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీఈఐఆర్ ద్వారా పోయిన ఫోన్లను ట్రేస్ చేసి కనిపెట్టారు. సోమవారం పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సమక్షంలో వినియోగదారులను పోలీస్టేషన్ కు పిలిచించి ఫోన్లను అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ఫోన్లను పోగొట్టుకుంటే సీఈఐఆర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, పోయిన ఫోన్లను కనిపెట్టి ఇప్పించడం జరుగుతుందున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
ఇది కూడా చదవండి….


