రైతులు అధిక దిగుబడులు సాధించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతులు అధిక దిగుబడులు సాధించాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– రైతులకు కంది విత్తనాల సంచులు పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు కంది సాగులో అధిక దిగుబడులు సాధించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మండలాల రైతులకు కంది విత్తనాల చిరు సంచులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రాంతం కంది సాగుకు ప్రాధన్యత పొందిందన్నారు. ఈ సీజన్లో రైతులు నాణ్యమైన కంది విత్తనాలతో సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి, బషీరాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నర్సిరెడ్డి, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పెద్దేముల్ ఎఫ్ఎఏసీఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, పెద్దేముల్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ధన్ సింగ్, సర్పంచుల సంఘం అధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, ఏడీ రుద్రమూర్తి, ఏఓ రజిత, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

తాత తడబడలేదు..!

chaithany collage