చిరస్మరణీయుడు మాణిక్ రావు
– ఆయన ఆశయ సాధనకు కృషి
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
– నివాళులు అర్పించిన పార్టీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్ రావు మహరాజ్ పేదల గుండెల్లో, నేతల్లో మనస్సుల్లో చిరస్మరణీయుడు అని తాండూరు కాం్రగెస్ నాయకులు అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మాణిక్ రావు 7వ వర్దంతి వేడుకలు జరుపుకున్నారు. పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయ సమీపంలో ఉన్న మాణిక్ రావు విగ్రహానికి ప్రభాకర్ గౌడ్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వర్గీయ మాణిక్ రావు తాండూరులోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతినికి ఎంతో కృషి చేశారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి నిరంతరం పాటు పడిన మహనీయుడని కొనియాడారు. మాణిక్ రావు స్పూర్తితో ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, నాయకులు జలాల్, సమద్, నవాజ్, అంజన్, రాజుగౌడ్, నర్సింలు, బలరాం, నారా అశోక్, జావిద్, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

