మోడికి 25 ఎకరాల భూమి రాసిస్తా
– అతనే నా 15వ కుమారుడు
– వందేళ్ల భామ్మ ప్రకటన
దర్శిని డెస్క్ : దేశ ప్రధాని నరేంద్రమోడికి 25 ఎకరాల భూమిని రాసిస్తానని ఓ వందేళ్ల బామ్మ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ రాజ్‌గఢ్ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన మంగీబాయి తన్వర్ అనే ఆ వృద్ధురాలికి ఇప్పటికే 14 మంది సంతానం ఉన్నారు. ప్రధాని దేశానికి ఎంతో సేవ చేస్తున్న ప్రధాని మోడిని తన 15వ కుమారుడిలా భావిస్తానని ఆమె చెబుతోంది. తనలాంటి వాళ్లకు ఎన్నో పథకాలు అందిస్తున్నారని తెలిపింది. ‘‘మోదీ నాకు ఇల్లు ఇచ్చి.. ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వితంతు పింఛను ఇచ్చి ఆర్థిక స్తోమత కల్పిస్తున్నారు. ఆహారం అందిస్తున్నారు. ఆయన వల్లే నేను తీర్థయాత్రలకు వెళ్లగలిగాను. అందుకే ఆయన నా కుమారుడు. అవకాశం ఉంటే ప్రధానిని స్వయంగా కలవాలని ఉంది’’ అని మంగీబాయి పేర్కొంది. తనతో పాటు దేశంలోని ఎందరో వృద్ధుల అవసరాలు మోదీ తీరుస్తున్నారని ఆ బామ్మ చెప్పుకొచ్చింది. అందుకే తన 25 ఎకరాల ఆస్తిని ఆయన పేరున రాసి ఇవ్వనున్నట్లు మంగీబాయి స్పష్టం చేసింది. ఆమె చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి…


