వైభవంగా తొలి ఏకాదశి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా తొలి ఏకాదశి..!
– పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
– దర్శించుకున్న భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. గురువారం తొలి ఏకాదశి సందర్భంగా తాండూరు పట్టణంలోని పాండు రంగాదేవాలయం, పాత తాండూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు తాండూరు మండలం దస్తగిరిపేట్‌ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని పాండు రంగస్వామి దేవాలయాన్ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సందర్శించారు. ఆలయంలో వెలసిన స్వామి వారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా తాండూరు మండలం దస్తగిరిపేట్‌ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు. ఎమ్మల్సీ వెంట మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, గడ్డలి రవీందర్, యువ నాయకులు తాండ్ర రాకేష్‌, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

అతిరుద్ర యాగంకు ఆహ్వానించిన ఎమ్మెల్యే
పాండురంగ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పూజల అనంతరం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వచ్చేనెల 3నుంచి నూతన నివాసంలో నిర్వహిస్తున్న రాజశ్యామల, అతిరుద్ర మహాయాగానికి ఆలయ కమిటి సభ్యులను, భక్తులను ఆహ్వానించారు. స్వయంగా ఆహ్వాన పత్రికలను అందజేశారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage