ఎంసీహెచ్ లో కౌన్సిలర్ కాన్పు..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఎంసీహెచ్ లో కౌన్సిలర్ కాన్పు..!
– పండండి బిడ్డకు జన్మనిచ్చిన ఎర్రం వసంత
– అభినందనలు తెలిపిన నేతలు, ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరోగ్యం మీదుకు వస్తే డబ్బులేని వాళ్లు అయినా సరే కార్పోరేట్ ఆసుపత్రికి పరుగెడుతారు. ఇక ప్రసవం విషయానికి చెప్పనక్కర్లేదు. కార్పోరేట్, ప్రవేటు ఆసుపత్రికి వెళ్లి డెలివరీ సేవలు పొందుతారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్ ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానమైన మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. పట్టణంలోని 16వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్‌గా ఎర్రం వసంత కొనసాగుతున్నారు. ఆయన భర్త ఎర్రం శ్రీధర్ బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నారు. ఎర్రం వసంతకు ఇదివరకే మొదటి సంతానంగా పాప ఉన్నారు. రెండో కాన్పులో భాగంగా ఆమె పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యురాలు ఆమెకు ప్రసూతి సేవలు అందించారు. రెండో కాన్పులో పండంటి బాబుకు జన్మనిచ్చారు. ప్రజా ప్రతినిధురాలుగా ఉండి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేసుకోవడం పట్లు కౌన్సిలర్ ఎర్రం వసంత ఆదర్శంగా నిలిచారు. ఈ విషయం తెలిసిన రాజకీయ నాయకులు, పట్టణ వాసులు కౌన్సిలర్ కు అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage