సోషల్ మీడియాపై నిఘా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

సోషల్ మీడియాపై నిఘా..!
– వివాదాస్పద పోస్టులపై దృష్టి
– శృతి మించితే కేసుల నమోదుకు చర్యలు
– హెచ్చరించిన తాండూరు పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో ఇది శ్రుతి మించి వివాదాలకు దారితీస్తోంది. లేనివాటిని ఉన్నట్లు, ఉన్నవాటిని లేనట్లు చిత్రీకరించి.. భావోద్వేగాలు రెచ్చగొట్టేలా పెడుతున్న పోస్టులు పార్టీల మధ్యే కాదు, సాధారణ ప్రజల మధ్యా చిచ్చు పెడుతున్నాయి. ఇలాంటివాటికి కళ్లెం వేసేందుకు తాండూరు పోలీసు శాఖ అధికారులు నడుం బిగించారు. బుధవారం తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో సోషల్ మీడియా వేధికగా జరుగుతున్న వివాదాస్పద పోస్టులపై దృష్టిసారిచండం జరిగిందన్నారు. ఫేస్ బుక్, వాట్సాఫ్‌ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలపై నిఘా ఉంచడం జరిగిందన్నారు. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు అభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. లేనిపోని వివాదాస్పద పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు. వివాదాలకు, విఘాదాలకు కారణమయ్యే పోస్టులు పెడితే సుమోటో కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు, వినియోగ దారులు సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!