నోటరీల రెగ్యులైజ్‌కు చాన్స్‌..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

నోటరీల రెగ్యులైజ్‌కు చాన్స్‌..!
– కొనుగోలు దారులకు హక్కులు
– మీసేవా కేంద్రాలలో దరఖాస్తులు
– మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: నోటరీల ద్వారా స్థలాలను కొనుగోలు చేసిన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నోటరీల కొనుగోళ్లను రెగ్యూలరైజ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ద్వారా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ జిల్లాల కలెక్టర్లకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు. మూడు నెలల్లో ఈ ప్రకియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. అంటే నోటరీల ద్వారా స్థలాలను కొనుగోలు చేసిన వారికి వాటిపై హక్కులు పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం లబ్దిదారులు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులతో నోటరీ దస్త్రాలు, లింకు డాక్యుమెంట్లు, ఆస్తి పన్ను రసీదు, విద్యుత్‌ వినియోగ రసీదు, నీటి పన్ను రసీదు, ఇతరత్రా ఆధారాలను జతచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన నోటరీలైతే 58, 59 జీవోల కిందకు చేర్చి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారు. అయితే 125 చ.గజాల లోపు స్థలానికి ఎటువంటి స్టాంపు డ్యూటీ ఉండదు. ఆపై ఉన్న విస్తీర్ణానికి మార్కెట్‌ ధరను వర్తింపజేస్తారు. గరిష్ఠంగా మూడు వేల చ.గజాలలోపు స్థలాల నోటరీలను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. దరఖాస్తులను కలెక్టర్‌ పరిశీలించి, వాటిని 22ఏ-ప్రభుత్వానికి చెందినవి, ఇతర ఆస్తులు అనే రెండు రకాలుగా విభజిస్తారు. జిల్లాల కలెక్టర్లే దీనిపై తుది నిర్ణయాధికారం తీసుకుంటారిన ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వం ఉత్తర్వులతో నోటరీ ద్వారా కోనుగోళ్లు చేసిన వారికి లబ్ది చేకూరనుంది.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!