విద్యతో పాటు ఉద్యోగవకాశాలు
– సిందు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ విజయాదేవి రంగారావు
– కాలేజీలో క్యాంపస్ సెలక్షన్స్ కు మంచి స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యతో పాటు విద్యార్థులు ఉద్యోగవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తాండూరు సిందు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయాదేవి రంగారావు అన్నారు. శనివారం సిందు డిగ్రీ కాలేజీలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ కు మంచి స్పందన లభించింది. మ్యాజిక్ బస్, ఇండియా పౌండేషన్ వారి అనుబంధ సంస్థలు విప్రో, ముత్తూట్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర, ఎస్బీఐ, సెవన్ టెక్, కనెక్ట్, జెన్ ఫ్యాక్ట్, వెట్రిక్ స్టాఫ్ సంస్థల నుంచి క్యాంపస్ ఇంటర్వూలను నిర్వహించారు. మొత్తం 220 మంది విద్యార్థులు ఇంటర్వూలకు హాజరుకాగ 125 మంది విద్యార్థులకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
అనంతరం కళాశాల వ్యవస్థాపకులు రంగారావు, ప్రిన్సిపల్ విజయాదేవిల చేతుల మీదుగా ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయాదేవి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలలో విద్యార్థులకు ప్రతి యేడాది క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..

