తాండూరుకు మంత్రుల రాక
– ఈనెల 27న మంత్రి హరీష్ రావు పర్యటన
– రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
– విలియమూన్ మైదానంలో భారీ బహిరంగ సభ
– విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు రాష్ట్ర మంత్రుల పర్యటన ఖరారయ్యింది. ఈనెల 27న తాండూరుకు ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వస్తున్నట్లు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని న తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న బుధవారం తాండూరుకు మంత్రి హరీష్ రావు హాజరువుతున్నారని తెలిపారు. తాండూరులో రూ. 50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు.
ఇందులో రూ.10.23 కోట్లతో జినుగుర్తి, కందనెల్లి, చంద్రవంచ, జుంటుపల్లి పరిధిలో సబ్ స్టేషన్ ల ఏర్పాటు, రూ.10 కోట్లతో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటి అభివృద్ధి పనులు, రూ.25 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ, రూ. 1 కోటితో తాండూరు లైబ్రరీ నూతన భవనానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని వివరించారు. అనంతరం పట్టణంలోని విలియమూన్ మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. మంత్రి హరీష్ రావుతో పాటు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డిలు హాజరవుతారని చెప్పారు. కావున మంత్రి పర్యటను విజయవంతం చేసేందుకు నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ లు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

