‘మోర్’లో.. చోరీ..!
– సెట్టర్‌ను ధ్వంసం చేసిన దుండగులు
– విచారణ చేపట్టిన పోలీసులు
– ఏమేం పోయాయంటే..?
తాండూరు, దర్శినిప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్లో చోరీ యత్నం జరిగింది. గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని పోలీస్టేషన్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. గత కొన్నేళ్ల క్రితం పట్టణంలో మోర్ సూపర్ మార్కెట్ ఏర్పాటయ్యింది. ప్రతి రోజూ భారీగా వ్యాపారం జరుగుతోంది. దీంతో మోర్ సూపర్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా మోర్ సూపర్ మార్కెట్ పైన ఉన్న షాపింగ్ మాల్లో చోరీకి యత్నించిన సంఘటనలను స్థానికులు గుర్తుచేస్తున్నారు. తాజాగా మోర్ సూపర్ మార్కెట్లో గుర్తుతెలియని దుండగులు షాపింగ్ సెట్టర్లను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు సంఘటనలు కనిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న తాండూరు పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ పుటేజీ ద్వారా ఆధారాలను పక్కాగా సేకరిచేందుకు చర్యలు చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మోర్ సూపర్ మార్కెట్లోని క్యాష్ కౌంటర్లో నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..

