మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్..!
– రంజాన్‌ను ప్రశాతంగ జరుపుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు మతసామరస్యతను చాటుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు ఫలహారాలు అందించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సబ్ కలెక్టర్ తో పాటు ముస్లిం పెద్దలకు పండ్లు తినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఆత్మీయతను చాటుతాయన్నారు. అదేవిధంగా మతసామస్యతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ మాసం అనంతరం ముస్లిం సోదరులు పండగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకొ వాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు అవినాష్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్. మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, అజయ్ ప్రసాద్, మైనార్టీ నాయకులు అబ్దుల్ హాది, మసూద్, మాజీ వై స్ చైర్మన్ సాజిద్ అలీ, పలువురు ముస్లిం పెద్దలు, మైనార్టీ యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…
ఇదికూడా చదవండి…

