సామాజిక సేవే ఎన్‌ఎస్పీ ట్రస్ట్ లక్ష్యం
– కళాశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: సామాజిక సేవే ఎన్ఎస్పీ(నూలి శుభఫ్రద్ పటేల్) చారిట్రబుల్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్టు సభ్యులు అన్నారు. మంగళవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. ఎన్ఎస్పీ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ ద్వారా ఎన్‌ఎస్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూతనందించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో బాగంగా కళాశాలలో నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తాండూరు ప్రజలకు సేవ చేయడమే (NSP) శుభప్రద్ పటేల్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి భాను, కళాశాల ప్రిన్సిపల్ నర్సి రెడ్డి, అధ్యాపకులు, శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు బాలు, చంద్రశేఖర్, అన్వర్ పాషా, గయాజ్, నరేష్ గౌడ్, సాయికుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

