సేవ చేస్తున్న అవకాశం ఇవ్వండి
– తాండూరు నుంచి పోటీ చేస్తా
– సీఎం కేసీఆర్ను కోరిన శుభప్రద్ పటేల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు సేవ చేస్తున్న తనకు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ కోరారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ను శుభప్రద్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు నియోజకవర్గంలో గత కొన్నేండ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. తాండూరులో అత్యధికంగా ఉన్న బీసీలు, లింగాయత్ జనాభాకు సేవకు ప్రాధాన్యమివ్వడం జరిగిందన్నారు. బీసీల మద్దతు ఉన్న తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని. కోరారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు శుభప్రద్ పటేల్ తెలిపారు.
ఇది కూడా చదవండి…

