ఎల్లుండి తాండూరుకు కర్ణాటక మంత్రి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎల్లుండి తాండూరుకు కర్ణాటక మంత్రి..!
– బాలాజీ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరానికి హాజరు
– వెల్లడించిన ఆసుపత్రి వర్గాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణానికి కర్ణాటర రాష్ట్ర వైద్య, విద్య శాఖ మంత్రి శరణు ప్రకాష్‌ పాటిల్ హాజరవుతున్నారు. ఈనెల 29న పట్టణంలోని శ్రీ బాలాజీ మల్టిష్పెషాలిటీ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరంకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంకు చెందిన మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. ఆసుపత్రి యజమాని, ప్రముఖ వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరంకు కర్ణాటక మంత్రి రావడం ఆసక్తిని సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో సేడం నియోజకవర్గం ఎమ్మెల్యేగా శరణు ప్రకాష్ పాటిల్ గెలిచారు. ప్రస్తుతం సిద్దిరామయ్య మంత్రి వర్గంలో శరణు ప్రకాష్ పాటిల్ వైద్య విద్య మంత్రిగా పనిచేస్తున్నారు. ఈనెల 29న నిర్వహించే మెగా వైద్య శిబిరంను తాండూరు ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సంపత్ సూచించారు. పలు విభాగాలకు చెందిన వైద్యులు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు.మరోవైపు తాండూరులో నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరానికి కర్ణాటక మంత్రి హాజరు కావడం రాజకీయ చర్చకు దారితీసింది. ప్రస్తుతం మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కలిసి పోవడంతో డాక్టర్ సంపత్ కుమార్, సతీమణీ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్‌లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!