లైబ్రరీలకు నూతన శకరూపు..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

లైబ్రరీలకు నూతన శకరూపు..!
– విజ్ఞానా బాంఢాగారాలకు కొత్త భవనాలు
– జిల్లాలోని గ్రంథాయాల అభివృద్ధికి ప్రాధాన్యత
– వికాబాద్‌ జిల్లా లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: విజ్ఞనాన్ని పంచే లైబ్రరీలకు నూతన శకరూపు ఆవిర్భవించేలా కృషి చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఓ ప్రకటనలో మాట్లాడారు. ఈ యేడాది జిల్లా కేంద్రం వికారాబాద్లో రూ. 1 కోటి 50 లక్షలతో నూతన భవనం ప్రారంభించడం జరిగిందన్నారు. ఆన్ డిమాండ్ మేరకు పాఠకులకు పుస్తకాలు, కుర్చీలను ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. ప్రస్తుతం గ్రంథాలయాల్లో విద్యార్థులు, నిరుద్యోగుల అనుకూలత కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సమయాల్లో మార్పులు తీసుకవచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కోడంగల్ లో రూ.73 లక్షల 90 వేలతో నూతన భవనం, మర్పల్లిలో రూ. 43 లోల 10 వేలతో నూతన భవనాలు ప్రారంభించడం. జరిగిందన్నారు. తాజాగా దోమలో రూ. 45 లక్షలతో నూతన గ్రంథాలయం నిర్మించడం జరిగిందని, ప్రారంభానికి సిద్దంగా ఉందన్నారు. దౌల్తాబాద్ లో రూ. 62లక్షల 80 వేలతో నూతన భవన పనులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇక తాండూరు పట్టణంలో రూ. 1కోటి 35 లక్షలతో నూతన భవనానికి శంకుస్థాపన చేయాల్సి ఉందని, దీంతో పాటు బొంరాస్ పేట్లో రూ. 64లక్షలతో నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉందన్నారు. అంతేకాకుండా మోమిన్ పేట్ లో గ్రంథాలయ మరమ్మత్తులకు రూ.15 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. మరోవైపు తాండూరు పట్టణంలోని గ్రంథాలయంలో అటెండర్ తుకారాంకు పదోన్నతి కల్పించడం జరిగిందని, గ్రేడ్-3 ఉద్యోగి స్వర్గీయ ఆర్.అంజయ్య కుమారుడు సాయి లక్ష్మణ్ కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కేటాయించడం జరిగిందన్నారు.

ఆగస్టులో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ముగ్గురు రికార్డు అసిస్టెంట్ లను వీఆర్ఎ ద్వారా కోడంగల్, కోట్ పల్లి, బషీరాబాద్ మండలాల్లోని గ్రంథాలయాల్లో నియామకం చేయడం జరిగిందన్నారు. రానున్న ఆరోజుల్లో కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డిల సహాకాంరతో జిల్లాలోని గ్రంథాలయాల ఆధునీకరణకు, పురోగతికి కృషి చేయడం జరుగుతుందని చైర్మన్ రాజుగౌడ్ పేర్కొన్నారు.

ఇది కూడ చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!