పేదింటి పెళ్లికి సంజీవన్న సాయం..!
– సొంత డబ్బులతో పుస్తె మెట్టెల బహుకరణ
– కృతజ్ఞతలు తెలిపిన కుటుంభీకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదింటి పెళ్లికి తాండూరు రైల్వే స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీరావు చేయూతనందించారు. పెళ్లి కుమారుడి కుటుంబానికి సొంత డబ్బులతో పుస్తె, మెట్టెలను బహుకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి 18వ వార్డుకు చెందిన నానాపురం వెంకటమ్మ, నానాపురం నర్సింలులది మండలంలోని జినుగుర్తి గ్రామం స్వస్థలం. గత కొన్నేళ్లుగా వారు ఇక్కడే స్థిరపడి ఉన్నారు. ఇటీవలే వారి కుమారుడు సురేష్ కు పెళ్లి నిశ్చయించారు. బుధవారం పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయంలో సురేష్ వివాహాము ప్రీతితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి కుమారుడు తరుపున పెళ్లి కూతురుకు సమర్పించాల్సిన పుస్తె, మెట్టెలు ఇచ్చేందుకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతకుముందే ఈ విషయం తెలుసుకున్న రైల్వే స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవ రావు వివాహా వేడుకకు హాజరయ్యారు. తన సొంత డబ్బులతో పెళ్లి కుమారుడి తరుపున సమర్పించాల్సిన పుస్తె, మెట్టెలను కుటుంభ సభ్యులకు ఆంధజేశారు.
పేదింటి పెళ్లికి సాయం అందించడం పట్ల కుటుంభీకులు సంజీవరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, నాయకులు చంటి యాదవ్, స్థానిక నాయకులు శాదీపురం గుండప్ప, ఎం. నగేష్ తదితరులు నూతన వధువరులను ఆశీర్వదించి.. పెళ్లికి సాయం అందించిన చైర్మన్ సంజీవరావుకు అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి..

