మంత్రి, ఎమ్మెల్యేలను కలిసిన నేతలు
– ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పిన స్టోన్, క్వారీ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని స్థానిక నేతలు, తాండూరు స్టోన్ అసోసియేషన్, క్వారీ అసోసియేషన్ నేతలు కలిశారు. శుక్రవారం హైదరాబాద్ లో మంత్రి మహేందర్ రెడ్డిని, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను వేరువేరుగా కలిశారు. మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డికి శాలువా కప్పి, ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ సాధించుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కూడా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫయాజ్ బేగ్, క్వారీ ఓనర్స్ అసోయేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, గఫ్పూర్ పాష, జైనోద్దీన్, అన్వర్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..

