రూ.3.06 లక్షల విరాళం అందజేసిన పైలెట్
– హిందూ ఉత్సవ సమితి ఇచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రూ. 3 లక్షల 6 వేల విరాళం అందజేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశారు. వచ్చే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనవంతుగా సమితికి రూ. 3లక్షల 6 వేల విరాళాన్ని ప్రకటించారు. ఈ నగదును ఒకేసారి సమితి ప్రధాన కార్యదర్శి పెద్దోళ్ల నర్సింలుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు వెంకటేష్, శ్రీకాంత్ రెడ్డి, కిరణ్ ముదిరాజ్, ఆశిష్, రజక నర్సింహా, తాంధ్ర నరేష్, వినోద్, కుమార్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

