బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి
– అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
– చట్టం అమలుపై కేంద్రం నజర్
దర్శిని డెస్క్ : దేశంలోని అన్ని రకాల అవసరాలకు బర్త్ సర్టిఫికేట్‌ను సింగిల్ డాక్యుమెంట్ గా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు జనన మరణాల నమోదు చట్టం(2003)ను పక్కాగా అమలు చేసేందుకు కేంద్రం నజర్ పెట్టింది. ఓ మనిషి పుట్టినప్పటి నుంచి చదివేందుకు స్కూల్, కాలేజీలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో సహా ఇతర ప్రభుత్వ రంగ సేవల కోసం ఈ డాక్యుమెంట్ ను అందజేస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టం అక్టోబరు 1 నుంచి అమలులోకి తీసుకరావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ చట్టంలోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చే రైట్స్ ను ఉపయోగించి.. కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేయనుంది. అందుకు సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి జన్మించే వారికి జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేయనున్నారు. వ్యక్తి పుట్టినతేదీ, పుట్టిన ప్రదేశాన్ని సూచించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుతంతో పాటు రాష్టంలో ఇతర సేవలను వినియోగించుకునేందుకు ఈ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది.
ఉద్యోగ నియామకాల కోసం బర్త్ సర్టిఫికేట్ ను సింగిల్ డాక్యుమెంట్ లా వినియోగించుకోవచ్చు. అక్టోబరు 1 నుంచి ఈ చట్టం అమలు కానుంది. జనన మరణాలు నమోదు చట్టం – 2023 బిల్లును గత వర్షకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఇదికూడా చదవండి…

