దళారులను నమ్మి మోసపోవద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దళారులను నమ్మి మోసపోవద్దు..!
– సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి విక్రయించాలి
– రైతులను ఇబ్బందులు పెడితి చర్యలు తప్పవు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పత్తి విక్రయాలలో దళారులను నమ్మి మోసపోవద్దని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. మంగళవారం యాలాల మండలం అగ్గనూరులోని మారుతి కాటన్ మిల్లు వద్ద సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తి రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు.

పత్తి రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే నిబంధనలు పాటించి పత్తిని విక్రయించాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి, మార్కేట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, డైరెక్టర్లు, సీసీఐ యాజమాన్యం,కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బీసీ స్మశాన వాటికను అభివృద్ధి చేయండి