కార్పోరేష‌న్ రుణాలను స‌ద్వినియోగం చేసుకోవాలి

తాండూరు వికారాబాద్

కార్పోరేష‌న్ రుణాలను స‌ద్వినియోగం చేసుకోవాలి
– మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌భుత్వం ఎస్టీ కార్పోరేష‌న్ ద్వారా అందిస్తున్న రుణాల‌ను ల‌బ్దిదారులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు పేర్కొన్నారు. శుక్ర‌వారం మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఎస్టీ కార్పోరేష‌న్ ల‌బ్దిదారుల ఎంపిక కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు హాజ‌రై ల్యాట‌రీ ద్వారా రెండు యూనిట్ల‌కు ముగ్గురు చొప్పున ల‌బ్దిదారుల‌ను
ఎంపిక చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్టీ కార్పోరేష‌న్ ద్వారా పాడి ప‌శువులు, మేక‌ల పెంప‌కం కింద ల‌బ్దిద‌రాల‌కు రుణాల‌ను మంజూరు చేస్తోంద‌న్నారు. ఈ రుణాల‌ను పొందిన ల‌బ్దిదారులు స‌ద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో కౌన్సిల‌ర్లు రాము, బోంబీనా, కోఆప్ష‌న్ స‌భ్యులు వెంక‌ట్రామ్ నాయ‌క్, కోఆర్డీనేట‌ర్ వెంకటేష్, మున్సిప‌ల్ మేనేజ‌ర్ బుచ్చిబాబు, బ్యాంకు ప్ర‌తినిధులు పాల్గొన్నారు.