మున్సిపల్ దుకాణాల కబ్జాపై కొరడా
– రెండు దుకాణాలను సీజ్ చేసిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మున్సిపల్‌కు చెందిన దుకాణాలు కబ్జాలో ఉండడంపై సంబంధిత అధికారులు కొరడా జులిపించారు. శనివారం గ్రంథాలయ సమీపంలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌లో రెండు దుకాణాలను సీజ్ చేశారు. దుకాణాల అద్దెతో పాటు ఖాళీగా ఉన్న దుకాణాలను బహిరంగ వేలంకు చర్యలు తీసుకోవడంలో భాగంగా మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు, రెవెన్యూ ఇనుస్పెక్టర్ శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో పట్టణంలోని మార్వాడీ బజార్‌లో ఉన్న దుకాణాల సముదాయంతో పాటు గ్రంథాలయ సమీపంలో ఉన్న దుకాణాల సముదాయాలలో
తనిఖీలు నిర్వహించారు. గ్రంథాలయ సమీపంలో ఉన్న దుకాణ సముదాయంలోని 6వ దుకాణంలో 2019 నుంచి బ్రహ్మంచారి ఇప్పటి వరకు కబ్జాలో ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా 13 దుకాణంలో దాదాపు 10 మాసాల నుంచి ఓ ప్రతికా విలేకరి కబ్జాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు పక్క దుకాణాల యజమానుల సమక్షంలో అట్టి దుకాణాలలో వస్తువులపై విడీయో తీసుకున్న అనంతరం దుకాణాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇస్పెక్టర్ శ్యాంసుందర్, మున్సిపల్ అధికారులు జంగయ్య, వెంకటయ్య, కిష్టయ్య తదితరులు ఉన్నారు.

