భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉల్ నబీ
– పురవీదుల్లో ఆకట్టుకున్న శాంతి ర్యాలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. గురువారం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉల్ నభి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా అహ్లే సున్నతి జమాత్ ఆద్వర్యంలో పట్టణంలోని పలు వీదుల్లో శాంతిర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని కీర్తనలు ఆలాపించారు. పాత తాండూరుతో పాటు పట్టణంలోని పురవీదుల్లో ర్యాలీ కొనసాగింది. పుర వి దుల్లో కొనసాగిన ర్యాలీలో తాండూరు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అ సున్నతి జమాత్ సభ్యులు, మత పెద్దలు, ముస్లి సోదరులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

