నిరుద్యోగులకు శుభవార్త..!

కెరీర్ జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

నిరుద్యోగులకు శుభవార్త..!
– డీఆర్డీఓలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
– పరీక్ష లేకుండా జాబ్‌, దరఖాస్తుకు నేడే ఆఖరు
దర్శిని డెస్క్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. డిఫెన్స్ ఆర్ అండ్ డీ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) శాఖలో ఉద్యోగాల భర్తికి నోటఫికేషన్ జారీ చేసింది. పరీక్ష లేకుండా ఉద్యోగాల ఎంపిక ఉంటుందని డీఆర్డీఓ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా స్పష్టం చేసింది.

ఇందులో వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 181 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదని, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిఫకేషన్ ద్వారా సైంటిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి దరఖాస్తు చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలని సూచించింది.

18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయని తెలిపింది. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగంలో చేరగానే 37,000 + HRA రూపాయలు జీతం ఇస్తారు. దరఖాస్తు చేసుకున్న వారినీ షార్ట్ లిస్ట్ చేసి, అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. GEN / OBC / EWS వారు 100 రూపాయలు, మిగతవారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. దరఖాస్తులకు నేడు 29వ తేది వరకు గడువు ఉంది.

ఇదికూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు