రేపు మాంసం దుకాణాల బంద్
– ప్రకటించిన మున్సిపల్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులోని మాంసం దుకాణాలను మూసి వేయాలని స్థానిక మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. సోమవారం గాంధీజయంతి ని పురస్కరించుకుని పట్టణంలోని మాంసం దుకాణాలపై ఆంక్షలు విధించడం జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడా పట్టణంలోని మటన్, చికెన్, ఫిష్, నాన్ వెజ్ హోటళ్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.
కావున పట్టణంలో మాంసం దుకాణాల వ్యాపారులు మటన్, చికెన్, ఫిష్ వ్యాపారులు దుకాణాలను మూసుకోవాలన్నారు. దీంతో పాటు కబేళాలు, హోటళ్లలో మాంసాలను విక్రయించరాదన్నారు. నిబంధనలకు విరుద్దంగా విక్రయాలకు పాల్పడితే చట్టరిత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి…

