పట్లోళ్ల నర్సింలుకు.. సాటెవ్వరు..!
– చైర్మన్ పీఠంకు సరైనోడు.. ఆయనొక్కడే
– మాట తప్పని, మడమ తిప్పని మామ
– మున్సిపల్ బరిలో అవకాశం ఇవ్వాల్సిందే
– పట్టుబడుతున్న పట్టణ యువత, సన్నిహితులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాట తప్పని.. మడమ తిప్పని.. ‘బొట్టు మామ’కు సాటెవ్వరు లేరంటూ తాండూరు పట్టణ యువత మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు కీర్తిని చాటుతున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ పదవికి అతనే సరైన నేత అంటూ.. చైర్మన్ రేసులో నర్సింలు ఎంపికను ఏకపక్షం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతంలో రాజకీయ దురంధరుడుగా పట్లోళ్ల నర్సింలుకు గుర్తింపు ఉంది. కేవలం ఒక్క సాయిపూర్ కే పరిమితం కాదు ఆయన గుర్తింపు.. తాండూరు పట్టణ యువత అంతా ముద్దుగా మా మామ అనే ముద్రను వేసుకున్నారు. ధీటైన వ్యక్తిత్వం, మాట తప్పని.. మడమ తిప్పని గుణంతో తన కీర్తిని అజరామంగా నిలుపుకుంటున్నారు. రాజకీయం ఆయన కుటుంబానికి ఏం కొత్త కాదు. పట్లోళ్ల సతీమణి పట్లోళ్ల రత్నమాల నర్సింలు, తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా సేవలందించారు.

పట్లోళ్ల నర్సింలు మున్సిపల్ నుంచి ప్రణాళిక సంఘం సభ్యులుగా పనిచేశారు. తాండూరు పట్టణ రాజకీయాలలో 25 ఏండ్ల అనుభవం ఉన్న నేతగా పట్లోళ్ల నర్సింలు, ఆయన సతీమణి పట్లోళ్ల రత్నమాలు గుర్తింపు పొందారు. రాజకీయాల్లో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి తదితర నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. నమ్మిన ప్రజల కోసం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్న నైజంతో పట్లోళ్ల నర్సింలు సూపర్ పొలిటికల్ లీడర్ అనిపించుకుంటున్నారు.

తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పట్లోళ్ల నర్సింలుకు చైర్మన్ పదవిని ఇవ్వాలని తాండూరు పట్టణ యువత, సన్నిహితులు డిమాండ్ చేస్తున్నారు. పట్టణ అభివృద్ధికి సరైన నాయకుడు అవుతారని అంటున్నారు. మామకు పదవి ఇస్తే అందరితో కలిసి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని అంటున్నారు. పాటిలేని నాయకునికి పదవి ఇస్తే ఇచ్చిన హామిలను తప్పక నెరవేరుస్తారని అంటున్నారు. సిసలైన నాయకునికి అన్యాయం జరగరాదని.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

