గ్రామాల్లో ప్రగతి వెలిగిపోవాలి
– కరోనా చీకట్లు తొలగిపోవాలి
– తాండూరు జెడ్పీటీసీ గౌడీ మంజుల వెంకటేశం
తాండూరు రూరల్, దర్శని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి కాంతులు వెలగిపోవాలని తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం ఆకాంక్షించారు. గురువారం జరుపుకునే దీపావళి పండగను దృష్టిలోఉంచుకుని ప్రజలకు, రైతులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో అన్ని గ్రామాల ప్రజలందరు ప్రగతిని సాధించాలని అన్నారు. కరోనా మహమ్మారితో చీకట్లు నిండిన కుటుంబాల్లో ఇకనుంచి కొంగొత్త వెలుగులు విరజిమ్మాలని కోరుకున్నారు. పండగలో ఎలాంటి అశ్రద్ద, అజాగ్రత్త పాటించకుండా సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
