చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన బీసీ సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు బీసీ సంఘం తాండూరు నాయకులు నివాళులు అర్పించారు. ఆదివారం చాకలి ఐలమ్మ 126 జయంతిని పురస్కరించుకుని తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని విజయ విద్యాలయ సమీపంలో ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణాచారి, జుంటుపల్లి వెంకట్, టైలర్ రమేష్, రాము ముదిరాజ్, రాజు యాదవ్, అశోక్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
