బీసీ కులాల‌ను అవ‌మానిస్తున్న కేంద్రం

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

బీసీ కులాల‌ను అవ‌మానిస్తున్న కేంద్రం
– బీసీ సంఘం తాండూరు క‌న్విన‌ర్ రాజ్‌కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: కుల గ‌ణ‌న‌లో బీసీల‌ను చేర్చ‌రాద‌ని మోడీ ప్ర‌భుత్వం బీసీల‌ను అవ‌మానిస్తోంద‌ని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. కుల గణనలో బీసీలను చేర్చ వద్దని సుప్రీంకు మోదీ సర్కార్ విన్న‌వించిన వైఖ‌రికి ఆదివారం రాజ్‌కుమార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. 2010 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వని బీసీల జనాభా లెక్కల సేకరించాలని ప్రస్తుత బిజెపి పార్టీ పార్లమెంటులో డిమాండ్ చేసింద‌ని గుర్తుచేశారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ‌ అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ జనాభా లెక్కలు చేస్తామని ప్రకటించారని అన్నారు. ప్ర‌స్తుతం జనాభా లెక్కలు తీసే సమయం వచ్చే నాటికి మాట మార్చడం బీజేపీ ద్వంద్వ వైఖరిని ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేయరాదని సుప్రీంకు విన్నవించు కోవడం వెనుకబడిన తరగతులను అవమానించినట్టే అని పేర్కొన్నారు.