మృతుని కుటుంబానికి మనోహర్ రెడ్డి భరోసా

తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుని కుటుంబానికి మనోహర్ రెడ్డి భరోసా
– ఆర్థిక సాయం అందజేసిన పార్టీ నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి మృతుని కుటుంబానికి భరోసా అందించారు. అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే… తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింలు అనారో గ్యంతో మృతి చెందారు. బుధవారం పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మనోహర్ రెడ్డి కుటుంభానికి భరోసా అందించారు. పార్టీ నేతలతోనే కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. ఇదే కుటుంబానికి గ్రామానికి చెందిన టీ.సుధాకర్ కూడా తనవంతుగా రూ. 3 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు బోయ అశోక్, నాయకులు రాజు, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

కాంగ్రెస్ ను ‘గ్యారెంటీ’గా నమ్మరు..!