సర్దుకోండి ప్లీజ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సర్దుకోండి ప్లీజ్..!
– ఆర్టీసీ ప్రయాణికులకు సూచన
– మేడారంకు తాండూరు బస్సులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజా రవాణా సేవలో నిమగ్నమైయ్యే ఆర్టీసీ సంస్థ తాండూరు నియోజకవర్గ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. వారం రోజులు బస్సుల రవాణా సౌకర్యంలో ఆటంకం ఏర్పడుతుందని తెలిపేందుకు చింతిస్తూ సర్దుకుపోవాలని సూచించింది. ఈ సూచనకు కారణమేంటో తాండూరు డీపో మేనేజర్ సమతారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ప్రసిద్ద మేడారం జాతర కోసం తాండూరు ఆర్టీసీ డిపో నుండి 46 బస్సులను పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 18 తేదీ నుండి 25వ తేదీ వరకు డిపోలో ఉన్న మిగతా 47 బస్సులతో ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తామని అన్నారు.

వారం రోజులపాటు సగం బస్సులను మాత్రమే నడపనుండడంతో ప్రయాణికులకు కొంత రవాణా ఇబ్బందులు కలుగుతాయని, దీనికి ప్రయాణికులు అందరూ సహకారం అందించాలని కోరారు. ఈనెల 26వ తేదీ నుండి పూర్తిస్థాయి బస్సులు నడుస్తాయన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!