గ్యారెంటీగా అందరిని ఆదుకుంటాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గ్యారెంటీగా అందరిని ఆదుకుంటాం..!
– ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటేయాలి
– ఇంటింటి ప్రచారంలో బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ పథకాలతో అందరిని ఆదుకుంటామని ఆ పార్టీ నాయకులు, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో మనోహర్ రెడ్డి పాల్గొని పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తదితరులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హాయాంలోనే పేదల అభివృద్ధి, సంక్షేమం జరిగిందన్నారు. మరోసారి పేదలకు సంక్షేమం, అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిందన్నారు. మహాలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, యువ వికాసం, చేయూత పథకాలపై ప్రజలకు వివరించి చైతన్య పరిచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటింటికి గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతుందన్నారు.

తొమ్మిందేండ్లుగా ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, సీనియర్ నాయకులు కోర్వార్ నగేస్, పరమేశ్వర్, వెంకటేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత