‘చేయి’ని చిత్తుగా ఓడించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

‘చేయి’ని చిత్తుగా ఓడించాలి
– రైతుబంధును అడ్డుకుంటే పుట్టగతులుండవ్
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి మోసం చేసేందుకు కుట్రచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఓ ప్రకటనలో మాట్లాడుతూ రైతుబంధు కింద రైతులకు అందించే పెట్టుబడి సాయంను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేయడంపై ఖండించారు. వచ్చే నవంబర్ మాసంలో రబీ సీజన్ కు సీఎం కేసీఆర్ ఇవ్వాలని యోచిస్తుంటే కాంగ్రెస్ అడ్డుకోవడం శోభనీయమన్నారు. రైతులకు సాయం నిలిపివేయాలని చూస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు. అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం, ఇప్పుడు సాయాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ కు రైతుల చేతులో పుట్టగతులుండవన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో రైతులకు ఆ పార్టీకి ఓటేసి మోసపోయారని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ కుటిల నీతిని రైతులు గ్రహించాలని అన్నారు. ఎన్నికల్లో రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత