కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి..!
– ఎంపీ ఎన్నికల్లో పోటీకి అవకాశం
– గెలుపుపై స్కెచ్ వేసిన హస్తం
– హాట్‌ టాపిక్‌గా మారిన రాజకీయం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఈ సారి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు వికారాబాద్‌ జిల్లాలో రసవత్తరంగా మారడం ఖాయమని నేతలు, ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో పోలికల్‌ హీట్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పటికే చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి టిక్కెట్‌ను కన్‌ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. చేవేళ్ల పార్లమెంట్ స్థానానికి బీజీపి నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు సీనీయర్ నేతలు అందెల శ్రీరాములు యాదవ్, భాస్కర్ యోగిలు పోటి చేస్తారని ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకుంది.

ఇప్పుడు జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది. చేవేళ్ల స్థానంపై గురి పెట్టింది. బలమైన నేతను బరిలో దించాలని కరసత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన బడా నేతను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా స్థాయి పదవిలో ఉన్న నేత, మాజీ మంత్రిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన చేరిక ముహుర్తం కూడా దాదాపు ఖరారైనట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ ప్రచారం చేవేళ్ల పార్లమెంట్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధ్యమైనంత త్వరగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికను పూర్తి చేసి బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరే మాజీ మంత్రి ఎవరనేది త్వరలోనే తేలనుంది.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!