విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వరా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వరా..!
– గణనాథులను దర్శించుకున్న శుభప్రద్ పటేల్
– ఉత్సవ సమితిలతో కలిసి భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తులకు ఎలాంటి అంటకాలు కలగకుండా విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వరా అంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ మెంబర్ నూలి శుభప్రద్ పటేల్ వేడుకున్నారు.
kvcs
తాండూరులో జరుగుతున్న వినాయక ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. శనివారం ధనగర్ గల్లీ లో శ్రీ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం లో గణనాథునికి పూజలు చేశారు. అనంతరం వారు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. తాండూరు ప్రజలు వినాయకుడి కృపతో క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. వ్యాపార రంగంలో లాభాలు చేకూరాలని. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ,తాండూర్ ప్రజలు విఘ్నాలు అని విగ్నేశ్వరుడు దూరం చేయాలనీ కోరుకున్నారు.

అనంతరం గాంధీ నగర్ , సీసీఐ కాలనీ , సౌరమ్మ దేవాలయం ఏర్పాటు చేసిన గణనాథులు దర్శించుకొని శుభ ప్రద్ పటేల్ ని ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు.అయన తో పటు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు స్వప్న పరిమళ , కోశాధికారి రొంపల్లి సంతోష్ , నాయకులు భాను , సాయి , మనోహర్ , నరేష్ గౌడ్ , దత్తు , గణేష్ ముదిరాజ్ , హరీష్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం