డయల్ 100 ‘షార్ట్’ హిట్
– తాండూరుకు యువకుల లఘుచిత్రానికి ఆదరణ
– ప్రశంసిస్తున్న అధికారులు, నాయకులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: నేరాల నియంత్రణలో పోలీసు శాఖ ప్రాధాన్యమిచ్చే డయల్ 100 వ్యవస్థపై తాండూరు యువకులు తీసిన షార్ట్ ఫిలిం(లఘుచిత్రం) సూపర్ హిట్ అయ్యింది. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా తాండూరుకు చెందిన కళాకారులు, యువకులు పోలీసుల సహాకారంతో డయల్ 100పై షార్ట్ ఫిలిం తీశారు. తాండూరుకు చెందిన డ్యాన్స్ మాస్టర్ రమేష్ దర్శకత్వంలో ఈ షార్ట్ ఫిలింను రూపొందించారు. ఇందులో తాండూరుకుచెందిన కాశీనాథ్, సంధ్య, వంశికలు నటించగా… కెమెరామెన్‌గా నవీన్ వ్యవహరించారు. ఇటివలే జిల్లా ఎస్పీ నారాయణ నారాయణ చేతుల మీదుగా అడిషనల్ ఎస్పీ రషీద్ సమక్షంలో విడుదల చేశారు. యూట్యూబ్, షోషల్ మీడియాలో ఈ షార్ట్ ఫిలింకు మంచి ఆదరణ రావడంతో దూసుకెళుతుంది. తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో అమలు చేస్తున్న డయల్ 100ను సామాన్యులు ఏవిధంగా ఉపయోగించుకోవాలో.. అమ్మాయిలు, బాలికలు ఆపదలో
ఉంటే ఎలాంటి సేవలు అందుతాయో.. నేరాల నియంత్రణకు పోలీసు శాఖ ఎలాంటి చర్యలు చేపడుతుందనే విషయాలపై షార్ట్ ఫిలింలో చూపించారు. కేవలం మూడు నిమిషాల్లో షార్ట్ ఫిలింను రూపొందించడం విశేషం. ఈ విడియోను చూసిన ఎస్పీ నారాయణ, అడిషనల్ ఎస్పీ రషీద్, తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిలతో పాటు ఎస్ఐలు చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. పలువురు నాయకులు కూడ అభినందిస్తున్నారు.
షోషల్ మీడీయాలో వస్తున్న ఈ లఘు చిత్రాన్ని చూసి ప్రతి ఒక్కరు వారిని అభినందిస్తూ.. డయల్ 100 షార్ట్ ఫిలిం సూపర్ హిట్ అంటూ ప్రశంసిస్తున్నారు.