ఆరో రోజు ఎనిమిది నామినేషన్లు
– జోరుగా దాఖలు చేసిన అభ్యర్థులు
– వెల్లడించిన ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం జోరుగా కొసాగుతోంది. గురువారం ఆరో రోజు ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తల్లి ప్రమోదిని రెడ్డి, కాంగ్రెస్ నుంచి డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, బహుజన లెఫ్స్ పార్టీ నుంచి మారోజు సునీల్ కుమార్, బీజేపీ నుంచి యు.రమేష్ కుమార్, ధర్మ సమాజ్ పార్టీ నుంచి గౌరీ శ్రీశైలంలతో పాటు స్వతంత్రులుగా మంబాపూర్ విజయేందర్, నేమూరి శంకర్ గౌడ్ లు ఇద్దరు మొత్తం 8 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి శ్రీనిరావు వెల్లడించారు.
ఈనెల 3 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో ఇప్పటి వరకు మొత్తం 21 నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో కొందరు డబుల్ సెట్లు సమర్పించినట్లు తెలిపారు.
ఇదికూడా చదవండి…

