పైలెట్ రోహిత్ రెడ్డికి జై..!
– మద్దతు ఇచ్చిన జైభీమ్ సంఘం
– ఎన్నికల తరువాత డిమాండ్లు నెరవేరుస్తాం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి జైభీమ్ సంఘం సభ్యులు జై కొట్టారు. శనివారం తాండూరు పట్టణంలో జై భీమ్ సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జైభీమ్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తాండూరులో 5 ఎకరాలలో బుద్ధవనం ఏర్పాటు, వృత్తి నైపుణ్య కేంద్రం ఏర్పాటు, ఎస్సీ స్మశాన వాటికకు స్థలం, ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రుణాలు, ఎస్సీ, ఎసీ, మైనార్టీలకు 70 గజాల స్థలంలో ఇండ్లు, కట్టడానికి రుణ సాయం అందిస్తే మద్దతు ఇస్తామని జైభీమ్ సంఘం సభ్యులు కోరిన డిమాండ్లకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సానుకూలత తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జైభీమ్ సంఘం డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కడా లేని విధంగా యాలాల, తాండూరులో రూ.2 కోట్లతో అంబేద్కర్ భనాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. తాండూరులో అంబేద్కర్ భవన్ కు ఎకరంన్నర భూమి కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు అంజిలయ్య, శివకుమార్, సాయి ప్రసాద్, నరేష్, ఎల్లప్ప, తమ్మప్ప, శ్రీనివాస్, చిన్నప్ప, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

