పైలెట్‌తో సీఐటీయూ, కేవీపీఎస్ దోస్తీ..!
– ఎమ్మెల్యేకు గెలుపుకు సంపూర్ణ మద్దతు
– కార్మికులకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో సీఐటీయూ, కేవీపీఎస్ సంఘాలు దోస్తీ కట్టాయి. ఈ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి గెలుపుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించాయి. శనివారం తాండూరు పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో సీఐటీయూ, కేవీపీఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో రోహిత్ రెడ్డి గెలుపుకు సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, నాయకులు సిద్రాల శ్రీనివాస్, సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, బుగ్గప్ప, కేవీపీఎస్ నాయకులు ఉప్పలి మల్కయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

