జనసేన జోష్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జనసేన జోష్..!
– తాండూరు పురవీధుల్లో బైక్ ర్యాలీ
– పారదర్శక పాలనే లక్ష్యం : ఎన్.శంకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జనసేన పార్టీ పుల్ జోష్ మీద ఉంది. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేమూరి శంకర్ గౌడ్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తాండూరులో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని విలయమూన్ నుంచి ఇందిరానగర్, పాండురంగ స్వామి దేవాలయం, వీవీహెచ్ఎస్, మర్రిచెట్టు కూడలి, గాంధీ చౌక్, భద్రేశ్వర చౌక్, రైల్వే బ్రిడ్జి, బోనమ్మ గుడి, గ్రీన్ సిటీ కాలనీ, ప్లెఓవర్ బ్రిడ్జీ, బస్టాండ్, ఇందిరా చౌరస్తా, సాయిపూర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో బీజేపీ నేతలతో పాటు జనసేన నాయకులతో అభ్యర్థి నేమూరి శలకర్ గౌడ్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

స్వయంగా బైకులు నడిపి కార్యకర్తలు ఉత్తేజ పరిచారు. మరోవైపు ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ తాండూరులో అవినీతికి అస్కారం లేకుండా జనరంజక పాలన అందిస్తామన్నారు. ప్రధాని మోడి సంక్షేమ పథకాలు అందరికి అందించడంతో పాటు ప్రతి ఒక్కరికి పారదర్శక పాలన అందించడమే జనసేన లక్ష్యమన్నారు. ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, కౌన్సిలర్ సాహు శ్రీలత, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, జనసేన నాయకులు అవి పటేల్, రాము తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!