రేపే వినాయక కన్వెన్షన్ ప్రారంభం
– సుందరంగా ముస్తాబైన ఫంక్షన్ హాల్
– ప్రత్యేక హోమాలు, పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని పాతకుంట ఆదర్శ నగర్ లో నిర్మించిన వినాయక కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభానికి ముస్తాబైంది. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో రేపు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

కన్వెన్షన్ ప్రారంభం సందర్భంగా ఫంక్షన్ హాల్‌లో వేదపండితుల సమక్షంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించనున్నారు. తాండూరులో ఎక్కడా లేని విధంగా ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించినట్లు విఠల్ నాయక్ తెలిపారు. సుమారు 3 ఎకరాల స్థలంలో ఫంక్షన్ హాల్, ఒక ఎకరా స్థలం లో పార్కు నిర్మించినట్లు చెప్పారు. అధునాతన హంగులతో, అన్ని వస్తులతో పూర్తి స్థాయి ఎసి హాల్ లతో సుందరంగా తీర్చిదిదద్దినట్లు చెప్పారు. కన్వేన్షన్ ప్రారంభోత్సవం సందర్భంగా గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలతో పాటు రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.
ఇది కూడా చదవండి…

