రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం
– బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, ఎన్ఎఫ్ఎఐ నాయకులు
– ఆహ్వానించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపంచుకుంటామని కాంగ్రెస్, ఎస్ఎఫ్ఎఐ నేతలు అన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, ఎస్ఎఫ్ఎలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అదేవిధంగా యాలాల మండలం నుంచి. తాండూరు పట్టణం 17వ వార్డు నుంచి, తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామం నుంచి యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సరైనోడు అని అన్నారు. ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో తన గెలుపుకోసం పార్టీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అందరు కారు గుర్తుకు ఓటేసేలా కృషి చేయాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

