పేదల సేవలో ఫోటోగ్రాఫర్లు
– ఆసుపత్రిలో పండ్లు, పేదలకు దుప్పట్ల పంపిణీ
– తాండూరులో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని ఫోటోగ్రాఫర్లు పేదల సేవలో సంతృప్తి పొందారు. శుక్రవారం ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తాండూరు ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాండూరులోని మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ అనిల్ కుమార్తో కలిసి గర్భిణులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. అ తరువాత తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలోని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు నరేష్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు శరణు బసవేశ్వర్, నాసిర్, అంబాదాస్, వీరన్న, హీరాలాల్ తో పాటు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.


