ఓటమిపై పైలెట్ స్పందన

తాండూరు రాజకీయం వికారాబాద్

ఓటమిపై పైలెట్ స్పందన
– అందుకే కాంగ్రెస్ గెలించింది
– ప్రజా తీర్పును స్వీకరిస్తా
– తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు. ఎన్నికల్లో ప్రజల ఇచ్చిన తీర్పును స్వీకరిస్తానని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. తన ఓటమికి ప్రత్యేక కారణాలు ఏమి లేవన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంటింటికి సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ప్రతి గడపకు పథకాలను అందించడం జరిగిందన్నారు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాలీ బలంగా వీయడంతో ప్రజలు తమను తిరస్కరించారని అన్నారు. ఓటర్ల తీర్పును సాధారంగా స్వీకరిస్తామని అన్నారు. ఓడిపోయినా ప్రజల కోసం పనిచేస్తామన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!