రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

క్రైం తాండూరు వికారాబాద్

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
– తాండూరు రైల్వే బ్రిడ్జీ సమీపంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : గుర్తుతెలియని రైలు ఢీకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ వీరేశం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం తాండూరు రైల్వే స్టేషన్ దాటిన తరువాత రుక్మాపూర్ వైపు వెళ్లే మార్గంలో ఉన్న తాండూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మరణించినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సుమారు 30-35 ఏండ్ల మద్య వయస్సు ఉండొచ్చని నిర్ధారించారు. గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో మృతుడు మరణించినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతుని వద్ద ఎలాంటి వివరాలు లభించలేదు. మృతుని ఒంటిపై నలుపు రంగు టీషర్టు, లేత నీలిరంగు ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. మృతుని వివరాలు తెలిస్తే సెల్: 8712513854, 9052390563లకు సంప్రదించాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!