చైనా మాంజా పట్టివేత
– రూ. 1 లక్ష 11 వేల సొత్తు స్వాదీనం
– టాస్క్‌ఫోర్స్ దాడులతో వ్యాపారిపై కేసు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు. నిరుద్ధంగా విక్రయాలకు పాల్పడుతున్న వ్యాపారిని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శనివారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ ఆధ్వర్యంలో బృందం తాండూరు పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణంలోని శివాజీ చౌక్ పాండురంగ దేవాలయం సమీపంలో ఓ వ్యాపతి చైనా మాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది.
బృందం సభ్యులు దాడులు చేసి వ్యాపారి వద్ద రూ. 1 లక్ష 11 వేల విలువైనా చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజాతో పాటు వ్యాపారిని పట్టణ పోలీస్టేషన్ కు తరలించారు. ఈ మేరకు వ్యాపారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఎవైనా నిషేధిత చైనా మాంజా విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి…

