లోక్ అదాలత్‌లో సత్వర న్యాయం
– కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు మున్సిప్ కోర్టు న్యాయమూర్తి టీ.స్వప్న
– తాండూరు న్యాయస్థానంలో 197 కేసుల రాజీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకుంటే క్షక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి టీ.స్వప్న అన్నారు. శనివారం తాండూరు న్యాయస్థానంలో జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా కేసులను రాజీకుదుర్చుకోవడానికి వచ్చిన వారితో న్యాయమూర్తి స్వప్న మాట్లాడారు. రాజీ చేసుకునేందుకు అవకాశం ఉన్న కేసుల్లో కోర్టుల చుట్టు తిరుగకుండా లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని కోరారు. లోక్ అదాలత్ సేవలను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మరోవైపు తాండూరు కోర్టులో నిర్వహించిన లోక్ ఆదాలత్‌లో 197 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో సీసీ కేసులు 34, ఎంసీ కేసులు 1, సివిల్ కేసులు 7, ఎస్ఐ యాక్టు కేసులు 2. క్రైం కేసులు 1, అడ్మిషన్ కేసులు 50, ఎస్‌టీసీ కేసులు 102 రాజీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, లోక్ అదాలత్ సభ్యులు, పాశం రవి కుమార్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.