భార్యను చంపిన భర్త రిమాండ్
– వివరాలు వెల్లడించిన పోలీసులు
– మృతురాలి చిన్నమ్మ ఫిర్యాదుతో కేసు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భార్యను కొట్టి చంపిన భర్తను తాండూరు పోలీసులు రిమాండుకు తరలించారు. శుక్రవారం తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించారు. గురువారం రాత్రి తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు రైల్వే గేటు సమీపంలో సుజాత అనే మహిళను ఆమె భర్త శ్రీకాంత్ హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. యాలాల మండలం కమాల్‌పూర్‌కు చెందిన సూజాత(23)కు 8ఏండ్ల క్రితం వివాహము జరిగింది. మొదటి భర్త నుంచి విడిపోయిన సుజాత కమాల్‌పూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్(28)ను రెండో వివాహము చేసుకుంది. కొన్నాళ్లుగా వారు పాత తాండూరు రైల్వే గేటు సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు.
గురువారం ఉదయం ఇద్దరి మధ్య కుటుంబ కలహాలతో వాగ్వివాదం జరిగింది. శ్రీకాంత్ విచక్షణ కోల్పోయి సుజాతను కర్రతో కొట్టాడు. రక్తపు మడుగులో సుజాతను ఆమె చిన్నమ్మ గిరిజాపురం చంద్రమ్మ తాండూరులోని జిల్లాప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం హతుడు శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో నిందితున్ని కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించడం జరిగిందని సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.
ఇదికూడా చదవండి…

