ఆసుపత్రికని వెళ్లిన మహిళ మిస్సింగ్..!
– తాండూరు పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి
– కరణ్ కోట్ పోలీస్టేషన్లో కేసు నమోదు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఆసుపత్రికని ఇంటి నుంచి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైనట్లు కరణ్ కోట్ పోలీస్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… కోడంగల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఆడికి ఆశప్పతో గత 20 ఏండ్ల క్రితం లక్ష్మీ (30) అనే మహిళతో వివాహము జరిగింది. గత 6 ఏండ్ల నుంచి ఆశప్ప అతని భార్య లక్ష్మీ తాండూరు మండలం గౌతాపూర్లోని నాగేశ్వర్ రావుకు చెందిన పాలిషింగ్ యూనిట్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. అయితే లక్ష్మీకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈనెల 9న ఆసుపత్రికి వెళతానని చెప్పి తాండూరుకు బయల్దేరింది.
సాయంత్రమైనా తిరిగి ఇంటిరాలేదు. తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో, తెలిసిన వారి వద్ద, బందువుల వద్ద విచారించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో భర్త ఆశప్ప ఆదివారం కరణ్ కోట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. లక్ష్మీ తప్పిపోయినప్పుడు ఒంటిపై లేత ఎరుపు రంగు చీర, జాకెట్ ధరించి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని, మహిళ ఆచూకీ తెలిస్తే కరణ్ కోట్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.
ఇదికూడా చదవండి…

